- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pathipati Pullarao: మంత్రులు, ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు..
రాష్ట్రంలో ఇసుక, మైనింగ్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచేస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు...

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఇసుక, మైనింగ్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచేస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో హద్దు అదుపు లేకుండా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మరీ దోచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక, మైనింగ్ రూపంలో రావలసిన ఆదాయాన్ని గండి కొట్టే విధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు దోచుకోమని జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు స్పష్టంగా కనబడుతుందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని గుంటూరు -ప్రకాశం జిల్లాల సరిహద్దులలో లారీలు దాటించినందుకు ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము కట్టకుండా విచ్చలవిడిగా దోచేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులను, ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా దోచుకోండని సీఎం జగన్ చెప్పినట్లుగానే వారంతా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.






