- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన పోలీసు విచారణ.. వైసీపీ నేత అంబటి సంచలన వ్యాఖ్యలు
వరదలపై తప్పుడు ప్రచారం చేసిన కేసులో పొన్నూరు వైసీపీ నేత అంబటి మురళిని పోలీసులు విచారించారు..

దిశ, వెబ్ డెస్క్: వరదలపై తప్పుడు ప్రచారం చేశారంటూ పొన్నూరు వైసీపీ నేత అంబటి మురళి(YSRCP leader Ambati Murali)పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన్ను విచారించారు. అమరావతి(Amaravati) వరద మళ్లించారని, పొన్నూరు(Ponnuru)లో పొలాలు ముంచారని అంబటి ప్రచారం చేశారు. దీంతో అంబటిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో నీటిపారుదల శాఖ ఫిర్యాదు చేసింది. విపత్తుల పేరుతో రైతులను భయబ్రాంతులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో భాగంగా అంబటిని గురువారం సుదీర్ఘ సమయం విచారించారు.
ఈ సందర్భంగా అంబటి మురళి మాట్లాడుతూ రాజధాని అమరావతిపై ఆరోపణలు చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. పొన్నూరు వరద ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని అడిగామని చెప్పారు. అమరావతిలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల అసలు పని చేయడం లేదని ఆరోపించారు. రైతుల తరపున తమ పోరాటం కొనసాగుతుందని అంబటి మురళి తేల్చి చెప్పారు.






