Thullur: బోరుగడ్డ అనిల్‌పై మరో రెండు కేసులు.. జైలుకు తరలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-11-06 13:30:51  IST  )

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌పై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు..

Thullur: బోరుగడ్డ అనిల్‌పై మరో రెండు కేసులు.. జైలుకు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌(YCP leader Borugadda Anil Kumar)పై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. రాజధాని ప్రాంతం తుళ్లూరు(Thullur)లో ఎన్నికల సమయం(2024 Elections)లో జరిగిన ఘటనలపై చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌పై దౌర్జన్యంతో పాటు ఏఎస్సైపై దాడి, దాబాలో పని చేస్తున్న బీహార్‌కు సంబంధించిన వ్యక్తులపై దాడి చేశారని అనిల్‌పై అభియోగాలున్నాయి. దీంతో రెండు కేసులు నమోదు చేసి అనిల్‌ను మంగళగిరి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు ధర్మాసనం 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)కు తరలించారు.

Next Story