పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్టు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-13 14:59:34  IST  )

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నరసరావుపేటలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు...

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్టు
X

దిశ, నరసరావుపేట: పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నరసరావుపేటలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి10 మందిని అరెస్టు చేశారు. నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంపురం ప్రాంతంలో ఓ ఇంటి మేడపై పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో సీఐ ఎస్.కే.టి. ఫిరోజ్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.23,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ ఫిరోజ్ మాట్లాడుతూ నరసరావుపేటలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story