- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నలుగురి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
ఎన్.ఆర్.టి సెంటర్ సమీపంలోని సరళ నర్సింగ్ హోమ్ వీధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు...

X
దిశ, చిలకలూరిపేట: ఎన్.ఆర్.టి సెంటర్ సమీపంలోని సరళ నర్సింగ్ హోమ్ వీధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారంతో సోమవారం సాయంత్రం అర్బన్ సి.ఐ పి. రమేష్ తన సిబ్బందితో కలిసి ఇంటిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు, విటుడు, మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 3,650 నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






