కాకాణి కేసులో ట్విస్ట్.. మరో ముగ్గురికి నోటీసులు !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy ) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

కాకాణి కేసులో ట్విస్ట్.. మరో ముగ్గురికి నోటీసులు !
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy ) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాల కృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి అలాగే చైతన్యలకు నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. ఇవాళ నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాలని... ఈ నోటీసుల్లో స్పష్టం చేశారు పోలీసులు ( Ap Police).

పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన తెల్ల రాయి అక్రమ తవ్వకం, రవాణాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం... ఈ ముగ్గురు వ్యక్తులను పోలీసులు విచారించబోతున్నారని సమాచారం అందుతుంది. అందుకే తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులో ఈ ముగ్గురు వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇక అటు ఈ కేసులో.... మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రోజురోజుకు ఉచ్చు బిగిస్తోంది. పోలీసులు నోటీసులు పలుమార్లు జారీ చేసినప్పటికీ... ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

గత వారం రోజులుగా... కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy ) అజ్ఞాతంలో ఉన్నారని సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అటు గిరిజనులను బెదిరించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై... ఇటీవల ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు అయింది. ఈ కేసులో కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ ( Bail ) పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ కేసు వివరాలు తెలియాల్సి ఉంది

Next Story