- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక అమరావతిని ఎవ్వరూ ఆపలేరు.. డిప్యూటీ సీఎం పవన్ గట్టి హెచ్చరిక!
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గత కుట్రలు, అపోహలు, న్యాయపరమైన చిక్కులను అధిగమించి అమరావతి శాశ్వత రాజధానిగా అవతరించడం ఐదు కోట్ల ఆంధ్రులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు మద్దతు తెలిపిన ఇతర పార్టీల ఎంపీలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విమర్శకులకు హెచ్చరిక.. సంబరాలకు పిలుపు
అమరావతికి చట్టబద్ధత రావడం జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలే గొప్ప గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అమరావతి ఇక అజేయమని, అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కూటమి పక్షాలు నిర్వహించే సంబరాల్లో జనసేన శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.






