సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు: మంత్రి సత్యకుమార్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-17 13:44:05  IST  )

లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు: మంత్రి సత్యకుమార్
X

దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభ(Lokhsabha)లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandi) చేసిన ప్రసంగంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులను, పుల్వామా వంటి ఉదంతాలను తక్కువ చేసి మాట్లాడటం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ ఏదో తెలియని 'మానసిక ఆనందాన్ని' పొందుతున్నట్లు కనిపిస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ వంటి సున్నితమైన అంశాలపై బాధ్యతారహితంగా మాట్లాడటం దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ లబ్ధి కోసం దేశ గౌరవాన్ని పణంగా పెట్టడం సరికాదు..

140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన ప్రధానమంత్రిని, దేశ సరిహద్దులను కాపాడే సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని సత్యకుమార్ హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం దేశ గౌరవాన్ని పణంగా పెట్టడం సరికాదని, రాహుల్ తన వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు. సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి ప్రవృత్తి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మంత్రి వ్యాఖ్యానించారు.

Next Story