- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు ఇంటి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పార్కింగ్ ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్ పొసుకుని ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తన ఇల్లు కబ్జా చేశారని ప్రజా వేదికలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని హాల్ చల్ చేశారు...

దిశ మంగళగిరి: ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పార్కింగ్ ప్రదేశంలో ఒంటిపై పెట్రోల్ పొసుకుని ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తన ఇల్లు కబ్జా చేశారని ప్రజా వేదికలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని హాల్ చల్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మంగళగిరి హాస్సేన్ కట్టకు చెందిన అడిగొపుల క్రాంతి కిరణ్‌గా గుర్తించారు.
ఘటనపై ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణ సిఐ కె వీరాస్వామి, మంగళగిరి సబ్ రిజిస్ట్రర్ బాలగురవయ్య, మంగళగిరి తహశీల్దార్ దినేష్ రాఘవేంద్ర, ఎంటిఎంసి డిసిపి ఆశోక్ కుమార్ పోలీస్ స్టేషన్లో క్రాంతి కిరణ్ నుంచి వివరాలు సేకరించారు. మంగళగిరి పట్టణ సర్వే నెంబర్ 155 /c లో 50 సెంట్ల భూమి క్రాంతి కిరణ్ తండ్రి మదన్ మోహన్ (లేటు) పేరుతో రికార్డుల్లో ఉన్నట్లుగా తెలిపారు. సర్వే నెంబర్ 244/2A 5 సెంట్లు క్రాంతి కిరణ్ పేరుతో ఉన్నట్లు పేర్కొన్నారు. తన తాత, దాయాదుల మధ్య మంగళగరి పూల మార్కెట్ సెంటర్‌లో ఇల్లు కోర్టు వివాదంలో ఉన్నట్లు చెప్పారు. క్రాంతి కిరణ్ ఆస్తులు ఆయన ఆధీనంలోనే ఉన్నట్లుగా అధికార యంత్రాంగం నిర్దారించింది. క్రాంతి కిరణ్ ప్రవర్తన, మానసిక స్థితిపై మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లి పోలీసులు ఘటనపై పలు కోణాలలో విచారిస్తున్నారు.






