- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై కీలక భేటీ
ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ అయింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల(AP Govt Employees) రిటైర్మెంట్ వయోపరిమితపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లతో పాటు 9,10 షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయోపరిమితిని పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. అయితే కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సాయంత్రం అధికారులతో ఆన్ లైన్ విధానంలో భేటీ అయింది. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయోపరిమితి పెంపుపై మంత్రులు నారాయణతో పాటు పయ్యావుల కేశవ్ చర్చించారు. కోర్టు ఆదేశాలతో 62 ఏళ్ల నిండిన 2,831 ఉద్యోగుల పరిస్థితిపైనా ఈ భేటీలో చర్చించారు. రిటైర్మెంట్ వయసు పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత?, ప్రభావాన్ని ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చించారు.
కార్పొరేషన్ల వారీగా ఉద్యోగుల సంఖ్యపై ఆరా
అయితే కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు. వయో పరిమితి పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వివరాలు సేకరించాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఇందులో భాగంగా మరోసారి భేటీ నిర్వహించాలని సూచించింది. ఉద్యోగుల రిటైర్మెంట్ పెంపుపై సమగ్రంగా చర్చించాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులను ఆదేశాలు జారీ చేసింది.






