- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15న తిరుపతిలో నూతన క్రికెట్ స్టేడియం ప్రారంభం
by Vemula.Srinu Prasad |
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో తిరుపతి గోలవనిగుంటలో నిర్మించిన నూతన క్రికెట్ స్టేడియం ఈ నెల 15న ప్రారంభం కానుంది...

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో తిరుపతి గోలవనిగుంటలో నిర్మించిన నూతన క్రికెట్ స్టేడియం ఈ నెల 15న ప్రారంభం కానుంది. రాష్ట్ర విద్య, మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేశ్ సాయంత్రం 4 గంటలకు స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ-2025లో క్రీడా కోటా ద్వారా నియమితులైన అభ్యర్థులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శాప్ అధికారులు తెలిపారు. క్రీడా అభివృద్ధికి తోడ్పడటం, భవిష్యత్ క్రీడాకారులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తిరుపతి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గోలవనిగుంటలోని క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 15న ఉదయం 9 గంటలకు ముందుగా హాజరుకావాలని సూచించారు.
Next Story






