ఉగ్రవాదంపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఉగ్రవాదంపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఉగ్రవాదంపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదంపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(Narasaraopet MP Lau Srikrishna Devaraya) సంచలన వ్యాఖ్యలు చేశారు. NCP-SCP ఎంపీ సుప్రియా సులే నేతృత్వంలో ఆయన ఇథియోపియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై అక్కడి ప్రజలు, అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే రాష్ట్రాలకు మధ్య మాకు తేడా కనిపించడం లేదు. వాటిలో సారూప్యతలు కనిపిస్తున్నాయి. కానీ మేము చూస్తూ ఊరుకోము. దేశ భద్రత కోసం తీవ్రంగా కృషి చేస్తాం. ఉగ్రవాదం ముప్పును తొలగిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఏ దేశం ప్రొత్సహిస్తోందో.. ఆ దేశాన్ని బ్లాక్ చేస్తాం.’’ అని పేర్కొన్నారు.

Next Story