- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరికొత్త అవతారంలో నారా దేవాన్ష్.. 'డైనోడీట్స్' పేరుతో పోడ్‌కాస్ట్ ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. చిన్న వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తూ, డైనోసార్ల నేపథ్యంగా ‘డైనోడీట్స్’ (Dino Deets) పేరుతో సొంతంగా ఒక పోడ్‌కాస్ట్ (Podcast) షోను ప్రారంభించారు. ఈ విషయానికి సంబంధించి మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ఆసక్తికరమైన టీజర్ వీడియోను పంచుకున్నారు. ఈ శుక్రవారం మొదటి ఎపిసోడ్ విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు.
ఉదయం నిద్రలేవగానే సర్‌ప్రైజ్..
దేవాన్ష్ పోడ్‌కాస్ట్‌ను నెటిజన్లకు పరిచయం చేస్తూ లోకేశ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ఉదయం నిద్రలేవగానే.. ఇంట్లో కాస్త గందరగోళంగా అనిపించింది. దేవాన్ష్ గది మొత్తం అకస్మాత్తుగా డైనోసార్లతో నిండిపోయింది. ఎక్కడ చూసినా డైనోసార్ పుస్తకాలు, పెయింటింగ్‌లు, బొమ్మలే దర్శనమిచ్చాయి. అసలు ఏం జరుగుతోందో అని నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు దేవాన్ష్ అసలు కారణం చెప్పాడు. తాను డైనోసార్ల గురించి రీసెర్చ్ చేస్తున్నానని, వాటిపై పోడ్‌కాస్ట్ చేస్తున్నానని తెలిపాడు. పిల్లలు ఎప్పుడూ అద్భుతమైన సర్‌ప్రైజ్‌లు ఇస్తారు. పరిచయం చేస్తున్నాం.. డైనో డీట్స్, చిన్న దేవాన్ష్ సొంతంగా డైనోసార్లపై చేస్తున్న పోడ్‌కాస్ట్. మొదటి ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది’ అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ టీజర్ వీడియోలో దేవాన్ష్ తన గదిలో ఉన్న డైనోసార్ బొమ్మలు, పుస్తకాల మధ్య కూర్చుని మాట్లాడుతున్న దృశ్యాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభం..
దేవాన్ష్ కొత్త ఇన్నింగ్స్ కోసం ‘డైనోడీట్స్’ పేరుతో ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను ప్రారంభించారు. యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన టీజర్‌ను లోకేశ్ రీట్వీట్ చేశారు. దేవాన్ష్ కొత్త ప్రయోగం పట్ల తల్లి నారా బ్రాహ్మణి, నాయనమ్మ నారా భువనేశ్వరి సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ శుక్రవారం నుంచి మొదలుకానున్న ఈ పోడ్‌కాస్ట్‌కు నెటిజన్లు, అభిమానులు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్నారు.
గతంలో వరల్డ్ రికార్డ్..
దేవాన్ష్‌కు చిన్న వయసులోనే రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. గతేడాది చెస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. అత్యంత క్లిష్టమైన ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 చెక్‌మేట్ పజిల్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్’ పురస్కారాన్ని దేవాన్ష్ అందుకున్నారు. చెస్ బోర్డుపై తన మెదడుకు పదును పెట్టి రికార్డుకెక్కిన దేవాన్ష్.. ఇప్పుడు తన మాటలతో పోడ్‌కాస్ట్ ద్వారా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






