జనసేనకు అండగా నాగబాబు సన్నిహితులు.. రూ.48 లక్షలు అందజేత

by Vemula.Srinu Prasad |

జనసేనకు నాగబాబుతో పాటు ఆయన సన్నిహితులు అండగా నిలిచారు..

జనసేనకు అండగా నాగబాబు సన్నిహితులు.. రూ.48 లక్షలు అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: జనసేనకు ఎమ్మెల్సీ నాగబాబుతో పాటు ఆయన సన్నిహితులు అండగా నిలిచారు. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ పార్టీకి ఫండ్‌గా రూ. 48 లక్షలు అందజేశారు. ప్రజలకు చేస్తున్న పవన్ కల్యాణ్ సేవల్లో “నా సేన కోసం నా వంతు"గా తాము సైతం భాగస్వాములవుతున్నామని ఈ సందర్భంగా నాగబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా జనసేన పార్టీకి వంతుగా రూ.48 లక్షలు డీడీల రూపంలో అందజేసినట్లు తెలిపారు. త్వరలో మరో రూ.2 లక్షలు కూడా డీడీ ద్వారా పార్టీకి అందజేస్తామని చెప్పారు. తద్వారా రూ.50 లక్షలు సమకూరుతాయని కె.నాగబాబు వెల్లడించారు. జనసేన పార్టీ కోశాధికారి రత్నంకి డీడీలు అందజేశారు.

Next Story