- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు: ఎన్డీఏ గెలుపుపై ఎంపీ లావు స్పందన
by Vemula.Srinu Prasad |
అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.డి.ఏ కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకమని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు , టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ...

X
దిశ, నరసరావుపేట ప్రతినిధి: అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.డి.ఏ కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకమని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మరియు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దేశంలో అభివృద్ధి, స్థిరత్వం, నిర్ణయాత్మక పాలనపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా , బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ ల తో పాటు జాతీయ నాయకత్వం అందించిన దిశా నిర్దేశం ఈ అద్భుత విజయానికి బాటలు వేసిందన్నారు. అభివృద్ధి అజెండాను నమ్మి ఎన్.డి.ఏ కి పట్టం కట్టిన ఆయా రాష్ట్రాల ప్రజలకు, విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు మరియు కూటమి నాయకత్వానికి శ్రీ కృష్ణ దేవరాయలు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Next Story






