అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాల్సిందే: ఎంపీ లావు

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య పదజాలం సహించరానిదని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు...

అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాల్సిందే: ఎంపీ లావు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Mp Ambati Rambabu) చేసిన అసభ్య పదజాలం సహించరానిదని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Srikrishnadevarayalu) అన్నారు. చంద్రబాబుపై అంబటి చేసిన అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. సీఎం చంద్రబాబుకి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన తెలవిపారు. దూషించేవారు - దోచిపెట్టే వారికే వైసీపీలో మనుగడ అనే ధోరణిలో వారి నాయకులంతా నడుచుకుంటున్నారని విమర్శించారు. అధిష్టానం నుంచి అలాంటి వారికే గుర్తింపు అనే సంస్కృతి ఆ పార్టీలో ఉందని ఎద్దేవా చేశారు. కానీ ప్రజలు ఇదంతా గమనిస్తునే ఉన్నారని, అలాంటివారిని ముమ్మాటికి క్షమించరన్నారు. చెత్త మాటలు మాట్లాడిన వారిని 2024 ఎలక్షన్‌లో చిత్తుగా ఓడించినా వారికి బుద్ధి రావట్లేదని చెప్పారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, అలా మాట మాట్లాడేటప్పుడు ఏది ధర్మం?, ఏది న్యాయం? అని గమనించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు.

Next Story