అవన్నీ అబూతకల్పనలే: ఎమ్మెల్సీ బొత్స

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు ప్రసంగాలు అబూతకల్పనలేనని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆయన విమర్శలు కురిపించారు..

అవన్నీ అబూతకల్పనలే: ఎమ్మెల్సీ బొత్స
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రసంగాలు అబూతకల్పనలేనని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Ycp Mlc Bosta Satyanarayana) అన్నారు. చిత్తూరు జిల్లా(Chittoor) పర్యటనలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆయన విమర్శలు కురిపించారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం పాలనలపై పలు ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు అబద్దాలు మాట్లాడుతారని, ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కడం ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు.. ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చారా..? అని, మహిళలకు రూ. 1500 ఇచ్చారా..? అని, మూడు సిలెండర్లు ఇచ్చారా..? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Next Story