- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేస్తాం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
మహిళలు సమాజానికి వెన్నెముక లాంటి వారిని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇన్చార్జి కొలుసు పార్థసారథి అన్నారు.

దిశ ప్రతినిధి, బాపట్ల: మహిళలు సమాజానికి వెన్నెముక లాంటి వారిని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇన్చార్జి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం రేపల్లె పట్టణంలో ఎం.సీ.ఏ హాల్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమెరికాలో 15వేల మంది మహిళలు కొన్ని నెలల పాటు పోరాడిన ఫలితంగా మహిళలు మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మహిళలు పురుషుల కంటే దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు పొలం పనులు చేసుకునే స్థాయి నుంచి కార్పొరేట్ ఆఫీసులు నిర్వహించే స్థాయికి చేరారని, రాష్ట్రంలో వివక్షత లేని సమాజం నిర్మాణానికి మహిళలు కృషి చేయాలన్నారు.
సీఎం చంద్రబాబు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించి వారి జీవితాలను చక్కగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నవంబర్ నుంచి 80 లక్షల మంది మహిళలకు 35 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించడానికి లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 9 వేల కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్న క్యాంటీన్లు, దీపం పథకాలను, పెన్షన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేపట్టారు అన్నారు. సమాజానికి మహిళలు అపారమైన సేవలు అందించారని వారిని ప్రతిరోజు గౌరవించాలని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 592 స్వయం సహాయక సంఘాలకు 13.6 కోట్ల రూపాయల మెగా చెక్కును రాష్ట్ర మంత్రులు మహిళలకు పంపిణీ చేశారు.
పీ.ఎం.ఈ.జీ.పి కార్యక్రమం క్రింద 75 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 95 లక్షల రూపాయల చెక్కును మహిళలకు మంత్రులు అందజేశారు. రేపల్లె మెప్మా ద్వారా 169 స్వయం సహాయక సంఘాలకు 13.5 కోట్ల రూపాయల చెక్కును మంత్రులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 33 మంది మహిళలను రాష్ట్ర మంత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, నెడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్. రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.






