ఆ పేరు వింటే కొడాలి నాని గజ గజ...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-13 10:31:05  IST  )

రెడ్ బుక్ వింటేనే కొడాలి నాని గజ గజలాడిపోతారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు.

ఆ పేరు వింటే కొడాలి నాని గజ గజ...!
X

దిశ, వెబ్ డెస్క్: గత ఎన్నికలకు ముందు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేశ్(TDP State General Secretary Lokesh) ‘యువగళం’(Yuvagalam) పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో టీడీపీ నేతలు, తమను ఇబ్బందులకు గురి చేసిన నాయకుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో నమోదైన వారిపై యాక్షన్ తీసుకుంటామని అప్పట్లోనే హెచ్చరించారు.


అయితే తాజాగా రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని గజగజ వణికిపోతున్నారట.. ఈ విషయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamsetti Subhash) తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నానిపై మండిపడ్డారు. జగన్‌ను సంతోష పెట్టేందుకు తమ పార్టీ నేతలపై గతంలో కొడాలి నాని ఏది పదితే అది మాట్లాడారని మంత్రి వాసంశెట్టి గుర్తు చేశారు. ఇప్పుడేమో రెడ్ బుక్ పేరెత్తినే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందని, అయితే వైసీపీ నేతల సంతకాల సేకరణ నాటకమని విమర్శించారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లు రావడానికి కారణాలపై సంతకాల సేకరణ చేయాలని సూచించారు. గత ప్రభుత్వం విశాఖను గంజాయి హబ్‌గా మార్చిందని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని లోకేశ్ పేర్కొన్నారు.

Next Story