2028 డిసెంబర్ నాటికి అమరావతి ఐకానిక్ భవనాలు: మంత్రి నారాయణ

by Ramesh Naini |

2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

2028 డిసెంబర్ నాటికి అమరావతి ఐకానిక్ భవనాలు: మంత్రి నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2027 జూన్ నాటికి ఏపీ రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు,1500 కిలోమీటర్ల లేట్ అవుట్ రోడ్లు పూర్తి అవుతాయని వెల్లడించారు. శనివారం అమరావతిలోని అనంతవరం, నెక్కలు గ్రామసభల్లో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రజలకు మంత్రి నారాయణ వివరించారు. గ్రామస్థుల నుంచి సమస్యలు, సలహాలు మంత్రి నారాయణ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

6 నెలల కాలంలోనే పూర్తిచేస్తాం..

పనులు ప్రారంభించిన 6 నెలల కాలంలోనే పూర్తిచేస్తామని నారాయణ కీలక హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్డు వేస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రస్తుతం 30 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని మంత్రి అన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2027 జూన్ నాటికి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు,1500 కిలోమీటర్ల లేట్ అవుట్ రోడ్లు పూర్తి అవుతాయని వెల్లడించారు.

Next Story