జగన్‌‌గారూ.. ఇవేం రాక్షస చేష్టలు?: మంత్రి నారా లోకేశ్‌

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-16 14:47:31  IST  )

దేశ రక్షణకు ఆధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి.. తరివేస్తానని వైఎస్‌ జగన్‌ అనడమేంటని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు...

జగన్‌‌గారూ.. ఇవేం రాక్షస చేష్టలు?: మంత్రి నారా లోకేశ్‌
X

దిశ, ఏపీ బ్యూరో: దేశ రక్షణకు ఆధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి.. తరివేస్తానని వైఎస్‌ జగన్‌ అనడమేంటని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. ఇదేం రాక్షస మనస్తత్వమని ఆయన ధ్వజమెత్తారు. మత్స్యకారుల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటాననడం ముమ్మాటికీ సైకోయిజమేనని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల్లిని తరిమేశారు. చెల్లిని గెంటేశారు..

‘తల్లిని తరిమేశారు. చెల్లిని గెంటేశారు. దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు. నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం.. కట్టినవన్నీ కూల్చేస్తాం.. కంపెనీలన్నీ వెళ్లగొడతాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జగన్‌ మోహన్‌ రెడ్డి గారూ!’ అంటూ మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు

Next Story