- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఏడుపు గొట్టు టీంతో పోల్చిన నారా లోకేశ్
ఏపీలో ఏడుపు గొట్టు బ్యాచ్ ఉందని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ విమర్శించారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 11 మంది ఏడుపు గొట్టు బ్యాచ్ ఉందని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ‘‘పెట్టుబడులు తీసుకువస్తామంటే ఏడుస్తారు. పెట్టుబడుల కోసం సింగపూర్‌కు వెళ్తే.. ఏపీకి రావద్దని ఆ ఏడుపుగొట్టు టీం ఈ-మెయిల్స్ పెట్టే పరిస్థితి. కొన్ని కంపెనీలను కలిస్తే ఏపీకి రావొద్దంటూ వారికి కూడా ఈ-మెయిల్స్ పెడుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ని చూసి సదరు కంపెనీలు వస్తే మాత్రం క్రెడిట్ తీసుకోవాలనుకుంటారు. క్రెడిట్ చోరీ అంటారు. టీం 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి వస్తారా?, కోడికత్తికి వారికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. చెల్లినీ, తల్లినీ గెంటేసిన క్రెడిట్ ఇవ్వాలి. రూ.700 కోట్ల ప్రజాధనంతో విశాఖలో ప్యాలస్ కట్టుకున్న క్రెడిట్ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి.’’ అని ఎద్దేవా చేశారు.






