కల్తీ నెయ్యి ఘటనలో అది ఆయనకే చెల్లింది: జగన్‌పై నారా లోకేశ్ విమర్శలు

by Vemula.Srinu Prasad |

కల్తీ నెయ్యి ఘటనలో అది జగన్‌కే చెల్లిందని మంత్రి నారా లోకేశ్ విమర్శలు కురిపించారు..

కల్తీ నెయ్యి ఘటనలో అది ఆయనకే చెల్లింది: జగన్‌పై నారా లోకేశ్ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: తప్పు చేసి బుకాయించడం వైఎస్ జగన్(Ys Jagan)కే చెల్లిందని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విమర్శించారు. కల్తీ నెయ్యి(Adulterated Ghee) ఘటనలో కోర్టుకు సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగలేదని సిట్ నివేదిక ఇవ్వలేదని, కానీ వైసీపీ హయాంలో తప్పు జరగనట్లు మాట్లాతున్నారని లోకేశ్ మండిపడ్డారు. మహాపాపం చేసి కూడా బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలే లేకుండా నెయ్యిని కల్తీ చేసి దేవుడి ప్రసాధాన్ని అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు. దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని లోకేశ్ వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూను కల్తీ చేసి వందల కోట్ల స్కాంకు పాల్పడటమే కాకుండా అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ కుట్రల భాగోతాన్ని ప్రజల్లోనే ఎండకడతామని లోకేశ్ హెచ్చరించారు.

Next Story