- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాదికి జాబ్ క్యాలెండర్.. ఏపీ అసెంబ్లీలో మంత్రి లోకేష్ ప్రకటన
నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా 8వ రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ, నిరుద్యోగుల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. జాబ్ క్యాలెండర్‌లోనే డీఎస్సీ పోస్టులను కూడా చేర్చనున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) గురించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీ అడ్మిషన్లు జరగడం లేదు.. కానీ మన దగ్గర అడ్మిషన్లకు డిమాండ్ ఉందని అన్నారు. కేంద్రం ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా కీలకం అని తెలిపారు. విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరమ్మతులను క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని హామీ ఇచ్చారు.






