- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడు జిల్లా రోడ్డుప్రమాదం.. మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రోడ్డుపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రోడ్డుపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మృతుల్లో నలుగురిని శ్రీకాంత్, వాసు, రామిరెడ్డి, మహేశ్ లుగా గుర్తించారు. మృతులు, క్షతగాత్రులంతా అయ్యప్పమాలధారణలో ఉండగా.. వీరంతో విజ్ఞాన్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
ఈ రోడ్డుప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరం. ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీశాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ ప్రమాదపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణ సమయాల్లో ఎవరూ వేగంగా వాహనాలు నడపవద్దని, అలాంటి సమయాల్లో తొందరపాటు తగదని సూచించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.






