- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడు మనిషి.. ఇప్పుడు మామిడి కాయలు: జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్
గతంలో మనిషిని.. ఇప్పుడు మామిడి కాయలను జగన్ తొక్కించేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు...

X
దిశ, వెబ్ డెస్క్: గతంలో మనిషిని.. ఇప్పుడు మామిడి కాయలను జగన్(Jagan) తొక్కించేశారని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి(Tenali)లో ఆయన పర్యటించారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజలను బెదిరించడమే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు తెలుసని ఎద్దేవా చేశారు. ‘‘కల్లాల్లోకి చెప్పులేకుండా వెళ్లడం సంప్రదాయం. దొంగచాటుగా మామిడి కాయలు తెచ్చి రోడ్లపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కించడం వైసీపీ వాళ్ల సంస్కారం. కేవలం ఫొటోలు, వీడియోల కోసం పంటను ట్రాక్టర్లతో తొక్కించడం దుర్మార్గం. వ్యక్తిగత విమర్శలు, పోలీసులను బెదిరించడం మంచిది కాదు. శాంతి భద్రతలకు విఘాంతం కలించే ప్రయత్నిస్తే కఠిన శిక్షలు తప్పవ్.’’ అని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
Next Story






