ఓపిక పట్టండి.. విజయసాయిరెడ్డి: సీఐడీ విచారణపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

కాకినాడ సీ పోర్టు వివాదంపై సీఐడీ విచారణకు సంబంధించి మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు చేశారు..

ఓపిక పట్టండి.. విజయసాయిరెడ్డి:  సీఐడీ విచారణపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ సీ పోర్టు వివాదం(Kakinada sea port dispute), కేవీఆర్ ఫిర్యాదుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాకినాడ సీ పోర్టులో వాటాలను బెదిరించి రాయించుకున్నారని సీఐడీకి కేవీఆర్ ఫిర్యాదు చేసిన విషయంపై స్పందించిన విజయసాయిరెడ్డి.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో విజయసాయి వ్యాఖ్యలపై నాదెండ్ మనోహనర్ సున్నితంగా విమర్శలు కురిపించారు. సీఐడీ విచారణ(CID investigation)కు ఆదేశిస్తే ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా విచారణ ప్రారంభం కూడా కాలేదని, కొంత సమయం ఓపిక పట్టండి అంటూ సెటైర్స్ వేశారు. ఎన్ని కుట్రలు చేశారో ప్రజలకు తెలుస్తాయని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

Next Story