Minister Kakani: చంద్రబాబుకు ఆ దమ్ముందా?.. పవన్ ఓ జోకర్

by Disha Web Desk 16 |
Minister Kakani: చంద్రబాబుకు ఆ దమ్ముందా?.. పవన్ ఓ జోకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌ వద్ద బుధవారం మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా తెనాలి బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ చేసిన సవాళ్లను స్వీకరించే దమ్ము టీడీపీకి ఉందా అని నిలదీశారు. చంద్రబాబు దుర్మార్గుడని రాష్ట్ర ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ లేదన్నారు. చంద్రబాబు ప్రతీరోజూ నాలుక మార్చుకుని మాట్లాడుతుంటాడని మండిపడ్డారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో లోకేశ్ యాత్రకు పక్క రాష్ట్రాల నుంచి జనాల్ని తీసుకొస్తున్నార‌ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు.

పవన్‌పై సెటైర్లు

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా ఆయన సెటైర్లు వేశారు. జనసేన పార్టీని, ఆ పార్లీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను తాము అసలు గుర్తించడం లేదని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. నిబద్ధత లేని వ్యక్తి గురించి, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్‌ మాత్రమేనంటూ సెటైర్లు వేశారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే పవన్ కల్యాణ్ పని అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed