- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్‌కు దమ్ముంటే నిరూపించాలి: Jogi Ramesh
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ సెటైర్లు వేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ సెటైర్లు వేశారు. పెడన వారాహి యాత్రలో తనపై రాళ్ల దాడి జరగబోతోందని, 3 వేల మంది తనపై దాడి చేసేందుకు వైసీపీ ప్లాన్ చేసిందని, ఇందుకు సంబంధించి తనకు సమాచారం ఉందన్న వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడలేక మద్దెల దరువు సామెత సరిగ్గా పవన్ కల్యాణ్‌కు సూటు అవుతుందన్నారు. పవన్ జనసేన యాత్రలో మాటలు కోటలు దాటతాయని.. చేతల్లో మాత్రం ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. పెడన ప్రజలకు కత్తులు, కటారులు తీసుకురావాల్సిన లేదని ఆయన వ్యాఖ్యానించారు. అవనిగడ్డలో జనం రాలేదని పెడన సభ కోసం డ్రామాలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. దాడి చేసేందుకు ప్లాన్ చేశామని చెప్పిన పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. దాడి చేస్తారని చెబుతున్న వారిని చూపిస్తే అరెస్ట్ చేయిస్తామన్నారు. పనికి మాలిన రాజకీయాలు పవన్ మానుకుంటే మంచిదని హితవు పలికారు.






