- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్చువల్ విధానం.. స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు 2026: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు 2026’ను ఈ సారి పూర్తిగా వర్చువల్ (డిజిటల్) విధానంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు 2026’ను ఈ సారి పూర్తిగా వర్చువల్ (డిజిటల్) విధానంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మహానాడు నిర్వహణపై కీలక దిశానిర్దేశం చేశారు. మే నెల 27, 28న జరగనున్న ‘మహానాడు’ కార్యక్రమానికి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌భవన్‌లో నేతలు పరిమిత సంఖ్యలో హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు వర్చువల్‌గా భాగస్వామ్యులు అవుతారు.
‘స్త్రీశక్తి’ థీమ్.. 1,845 క్లస్టర్లలో నిర్వహణ
మహానాడును మహిళా సాధికారతకు అద్దం పట్టేలా 'స్త్రీశక్తి' ప్రధాన ఇతివృత్తం (థీమ్)తో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,845 క్లస్టర్ల పరిధిలో క్షేత్రస్థాయిలో ఈ వర్చువల్ మహానాడు జరగనుంది. ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ రూపంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ క్లస్టర్ స్థాయి కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా భాగస్వాములు అవుతారు. ప్రజాప్రతినిధులు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల సాధికారతకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహానాడు తెలుగువారికి ఒక భావోద్వేగం
‘మహానాడు అనేది తెలుగువారికి ఒక భావోద్వేగం. గతంలో కోవిడ్ సమయంలోనూ డిజిటల్ పద్ధతిని విజయవంతంగా అమలు చేశాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి వర్చువల్ విధానాన్ని ఎంచుకున్నాం. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు ఘన నివాళులు అర్పిస్తూనే, రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యేలా ఈ మహానాడును జరుపుకుందాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.






