- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'శావల్యాపురం-బాపట్ల' రైల్వే లైన్ సాధిద్దాం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
పల్నాడు రూపురేఖలు మార్చేందుకు శావల్యాపురం-బాపట్ల రైల్వే లైన్ (Railway Line) సాధిద్దాం అని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు రూపురేఖలు మార్చేందుకు శావల్యాపురం-బాపట్ల రైల్వే లైన్ (Railway Line) సాధిద్దాం అని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) అన్నారు. నూతన రైల్వే లైన్ ఏర్పాటు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న 'శావల్యాపురం-బాపట్ల రైల్వే లైన్ సాధన సమితి' ప్రతినిధులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. శావల్యాపురం-బాపట్ల మధ్య ప్రతిపాదిత నూతన రైల్వే లైన్ ఏర్పాటు ఆవశ్యకతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి బలంగా తీసుకెళ్లాలని సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు. ఈ నూతన రైల్వే లైన్ పల్నాడు జిల్లాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వివరించారు. లైన్ ఏర్పాటైతే జిల్లా రూపురేఖలే మారిపోతాయని, ముఖ్యంగా జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెంది, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు తెలిపారు.
సమితి వినతిని ఆలకించిన ప్రత్తిపాటి పుల్లారావు సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతపై తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. అందుకోసమే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదించానని అన్నారు. ఈ ప్రతిపాదనను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. నూతన రైల్వే లైన్ రావడం పల్నాడు ప్రజల చిరకాల స్వప్నంగా అభివర్ణించారు. ప్రభుత్వాల సహకారం, మనందరి కృషి ద్వారా ఈ రైల్వే లైన్‌ను ఖచ్చితంగా సాధిద్దాం అని ఆయన ప్రతినిధులకు హామీ ఇచ్చారు.






