Janasena: పవన్ కల్యాణ్ సమక్షంలో కీలక నిర్ణయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-08-04 12:12:57  IST  )

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళగిరిలో కొనసాగుతోంది...

Janasena: పవన్ కల్యాణ్ సమక్షంలో కీలక నిర్ణయాలు
X

దిశ,వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళగిరిలో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర, పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహన్, నాగబాబు, సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నాదెండ్ల మనోహన్ మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉందన్నారు. పార్టీ అన్నాక కొన్ని ఇబ్బందులు, సమస్యలుంటాయని చెప్పారు. విశాఖ యాత్రలో భూదోపిడీని వెలుగులోకి తెస్తామన్నారు. ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను ప్రకటిస్తామని మనోహర్ తెలిపారు. ఏపీలో వ్యవస్థలను ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు.

ఇక నాగబాబు మాట్లాడుతూ చిరంజీవి, పవన్‌ను కోట్లాది మంది ఆరాధిస్తున్నారని తెలిపారు. అందరం కలిసి అడుగులు వేస్తే ఓడించడం కష్టంకాదని చెప్పారు. ఏ పార్టీకి లేని యువత బలం జనసేనకు ఉందన్నారు.

Read More..

Mangalagiri: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Next Story