- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mangalagiri: పవన్ యాక్షన్ స్టార్ట్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో రేపు విస్తృత స్థాయి సమావేశం
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి కర్యాచరణ రెడీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. టీడీపీతో పొత్తు ఖరారు చేసిన నేపథ్యంలో వారితో ఎలా కలిసి వెళ్లేదానిపై విస్తృతంగా చర్చించనున్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ పలు సూచనలు, సలహాలు చేయనున్నారు.
ఇక టీడీపీ, వైసీపీ జాయింట్ యాక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే దానిపైనా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరు..?. సీట్ల కేటాయింపు వంటి అంశాలకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన నేతలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఎంత బలం ఉందనే అంశానికి సంబంధించి శనివారం జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలతో పవన్ చర్చించే అవకాశం కనిపిస్తోంది.
.More News : పవన్ ఎంట్రీతో డిఫెన్స్‌లో వైసీపీ.. జగన్ ప్లాన్ అర్థంకాక ఆందోళనలో శ్రేణులు






