అమ్మ, అమరావతి, ఏపీ అంటే జగన్‌కు ఇష్టం లేదు: మంత్రి సంధ్యారాణి

by Ramesh Naini |

మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అమ్మ, అమరావతి, ఏపీ అంటే జగన్‌కు ఇష్టం లేదు: మంత్రి సంధ్యారాణి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ అంటే గిట్టని జగన్‌ను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయాలు చేసే ముందు ఆయన తన సొంత ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలవి మొసలి కన్నీళ్లు..

ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కడుపుమంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖను కబ్జాలు, అవినీతి దందాలతో నాశనం చేశారని, రుషికొండను బోడికొండగా మార్చారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కారణమైన వారు ఇప్పుడు ఉత్తరాంధ్ర మంచి చెడుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. విశాఖ వాసుల ఆస్తులను దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు.

కూటమి పాలనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే స్టీల్ ప్లాంట్‌ను తిరిగి తెరిపించామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషితో గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కడుతున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీ మీటింగ్‌లకు భయపడిన ఆంధ్రా యూనివర్సిటీ వీసీలు.. నేడు కూటమి ప్రభుత్వ అండతో వందేళ్ల పండుగను సగర్వంగా జరుపుకుంటున్నారని సంధ్యారాణి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది, చేసేది తామేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Next Story