సీఎం జగనే నాకు స్ఫూర్తి: Cricketer Ks Bharat

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-15 14:28:38  IST  )

అమరావతి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఇండియన్‌ క్రికెటర్ కేఎస్‌ భరత్‌ కలిశారు. ...

సీఎం జగనే నాకు స్ఫూర్తి: Cricketer Ks Bharat
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఇండియన్‌ క్రికెటర్ కేఎస్‌ భరత్‌ కలిశారు. ఈ సందర్భంగా ఇండియన్ క్రికెట్ టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని సీఎంకి కేఎస్‌ భరత్‌ బహుకరించారు. వైఎస్ జగన్‌ సీఎం అయిన తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్‌ కీపర్‌గా వ్యవహరించడం తనకు గర్వంగా ఉందని కేఎస్ భరత్ తెలిపారు. తాను సీఎం జగన్‌ను ఇన్స్‌పిరేషన్‌గా భావిస్తున్నానన్నారు. ఒక క్రికెటర్‌గా తనకు సీఎం జగన్ మద్దతు అవసరమని తెలిపారు. అటు సీఎం కూడా దేశం గర్వపడేలా, రాష్ట్రం పేరు, ప్రతిష్టలు నిలబెట్టాలని తనకు సూచించినట్లు కేఎస్ భరత్ స్పష్టం చేశారు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని, స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కూడా బావుందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్‌గా తనకు చాలా బావుందని, మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారని కేఎస్ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

ఆ పనులు నేను సినిమాల్లోనే చేయను.. ఇక ఇక్కడెందుకు చేస్తా: పవన్ కల్యాణ్

Next Story