- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ఎమ్మెల్సీ చేతిలో మోసపోయిన వృద్ధ దంపతులు.. న్యాయం చేస్తామని మంత్రి నారా లోకేశ్ హామీ
by Sujitha Rachapalli |
గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డి పాలెంకు చెందిన వృద్ధ దంపతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేశ్. తమ భూమిని లీజు పేరుతో తీసుకున్నారని.. కానీ తర్వాత ఆక్రమించుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు అమ్మిరెడ్డి దంపతులు.

X
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డి పాలెంకు చెందిన వృద్ధ దంపతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేశ్. తమ భూమిని లీజు పేరుతో తీసుకున్నారని.. కానీ తర్వాత ఆక్రమించుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు అమ్మిరెడ్డి దంపతులు. తమ కొడుకు దగ్గర 25 సెంట్లు లీజుకు తీసుకున్నారని.. మొత్తం తీసేసుకున్నారని ఆరోపించారని.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు లోకేశ్. దీనిపై విచారణ చేయించి.. ఇందులో నిజానిజాలను తెలుసుకుని న్యాయం చేయాలని అధికారులను కోరినట్లు చెప్పారు. సొంత బంధువైన వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వీరిపట్ల ఇంత దారుణంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. భూ కబ్జా వెనుక ఎంత పెద్దవారున్నా వదిలేది లేదని హామీ ఇచ్చారు.
Next Story






