రాజధానికి భారీగా పెట్టుబడులు.. రూ. 1,000 కోట్లతో బిట్స్ పిలానీ కొత్త క్యాంపస్‌

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-13 15:48:29  IST  )

ఏపీ రాజధాని అమరావతికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి....

రాజధానికి భారీగా పెట్టుబడులు.. రూ. 1,000 కోట్లతో బిట్స్ పిలానీ కొత్త క్యాంపస్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amvaravati)కి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం పలు కంపెనీలకు ఆహ్వానించింది. ఈ ఆహ్వానంతో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ(Birla Institute of Technology and Science) ముందుకు వచ్చింది. అమరావతిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, బిర్లా గ్రూప్ చైర్‌పర్సన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ రెండు దశల్లో దాదాపు 7,000 మంది విద్యార్థులను చేర్చుకుంటుందన్నారు. 2027కి ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉందని బిర్లా చెప్పారు.

ఇక 35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త క్యాంపస్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజీలో అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను అందిస్తుందని వైస్ ఛాన్సలర్ వి.రాంగోపాల్ రావు తెలిపారు. బిట్స్ పిలానీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి, విశ్వవిద్యాలయం దీర్ఘకాలిక పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను పెంచడానికి రూ.1,219 కోట్లు పెట్టుబడి పెట్టనుందని పేర్కొన్నారు.

Next Story