- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారా లోకేశ్ వేసిన బాటలే.. గత ఐదేళ్లలో గాడితప్పిన విద్యారంగానికి ప్రక్షాళన: హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
by Ramesh Naini |
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులు అద్భుత విజయాలు సాధించడం గర్వకారణమని రాష్ట్ర హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులు అద్భుత విజయాలు సాధించడం గర్వకారణమని రాష్ట్ర హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. ఘన విజయం సాధించిన విద్యార్థులను అభినందిస్తూ విద్యాశాఖ ప్రత్యేకంగా మీడియా ప్రకటనలు ఇవ్వడం శుభపరిణామం అన్నారు.
గత ఐదేళ్లలో గాడితప్పిన విద్యావ్యవస్థను తమ ప్రభుత్వం ప్రక్షాళన చేసిందని మంత్రి తెలిపారు. వంద రోజుల ప్రణాళిక అమలుతో ఫలితాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వేసిన బాటలే నేడు విజయకేతనాలుగా మారాయని ఆమె కొనియాడారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు.
Next Story






