- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలదిగ్బంధంలో ఏపీ రాజధాని గ్రామాలు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
ఏపీలో పలు చోట్ల భారీగా వర్షం కురిసింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో పలు చోట్ల భారీగా వర్షం(Rains) కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. గుంటూరు జిల్లా(Guntur District) వ్యాప్తంగా భారీగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువన కురిసిన వర్షానికి అటు రాజధాని గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. కరెంట్ సరఫరా సైతం నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గుంటూరు- తాడికొండ మధ్య రాకపోకలకు సైతం ఇబ్బందులు కలుగుతున్నాయి. కోటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమరావతి మండలం పెద్దమద్దూరువాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరాయి. జనజీవనం స్తంభించిపోయింది.
Next Story






