అమరావతిలో భారీ వర్షం.. పరిసరాల్లో బీభత్సం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-07 12:38:41  IST  )

రాజధాని అమరావతితో పాటు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం రాజధాని ప్రాంతాన్ని ముంచెత్తింది...

అమరావతిలో భారీ వర్షం.. పరిసరాల్లో బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati)తో పాటు గుంటూరు జిల్లా(Guntur District)లోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం రాజధాని ప్రాంతాన్ని ముంచెత్తింది. వెలగపూడిలోని సచివాలయ పరిసరాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఉద్యోగులు, సందర్శకులు ఇబ్బందిపడ్డారు. కొన్ని రోజులుగా వేధిస్తున్న ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సమీప మండలాల్లోనూ...

గుంటూరుతో పాటు తాడికొండ, మంగళగిరి, పెదకాకాని, పొన్నూరు వంటి సమీప మండలాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బలమైన గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అకాల వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా, వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Next Story