High Court: పీఎస్ఆర్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-15 07:47:04  IST  )

పీఎస్ఆర్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది...

High Court: పీఎస్ఆర్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఐసీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. గ్రూప్‌-1 అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీలుగా పీఆఎస్, మధు జైలులో ఉన్నారు. వారి తరపున హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

కాగా జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులను పీఎస్‌ఆర్ ఆంజనేయులు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా నటి జత్వానీని వేధించిన కేసులోనూ ఆయన ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జోరుగా జరిగింది.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీగలాగింది. దీంతో మూడు కేసుల్లో పీఎస్‌ఆర్ ఆంజనేయులు నిందితుడిగా ఉన్నట్లు తేలింది.

Next Story