బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆర్టీసీ చైర్మన్ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-30 13:16:25  IST  )

రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధతమవుతోంది..

బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆర్టీసీ చైర్మన్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం(Bus Travel) సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా గుంటూరు బస్ స్టేషన్‌లో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు(RTC MD Dwaraka Tirumala Rao)తో చైర్మన్ కొనకళ్ల నారాయణ సమీక్ష నిర్వహించారు. ఫ్రీ బస్సు స్కీం ప్రవేశపెడితే ఎదరయ్యే సవాళ్లు, సమస్యలుపై డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ మహిళల జీవితాల్లో మార్పు కోసమే ఫ్రీ బస్స స్కీం తీసుకొస్తున్నామని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఐడీ కార్డుతోనైనా మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని కొనకళ్ల పేర్కొన్నారు.

Next Story