నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యే జీవీ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యే జీవీ కీలక ప్రకటన
X

దిశ వినుకొండ: యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం హర్షణీయమని, దీని ద్వారా ఉన్నత విద్య, హోమ్ శాఖ, పాఠశాల విద్య వంటి వివిధ విభాగాల్లో మొత్తం 10,060 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16,500 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని, యువగళం హామీల మేరకు ఇప్పటివరకు 6,25,300 ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన వివరించారు. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ సమిష్టిగా కృషి చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం రూ.9.70 లక్షల కోట్ల అప్పులు విడిచి వెళ్లినప్పటికీ, వాటి భారంతోనూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్‌ను అందిపుచ్చుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

బొల్లా బ్రహ్మనాయుడిపై జీవీ ఆంజనేయులు నిప్పులు

ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై జీవీ ఆంజనేయులు నిప్పులు చెరిగారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అబద్ధాలతో కాలక్షేపం చేసిన బొల్లాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. "దొంగే దొంగ అన్నట్లుగా" బొల్లా తీరు ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి డబ్బులు చెల్లించలేదని, ఒక్క రైతును కూడా ఆదుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు పూర్తి మద్దతు ఇస్తుందని, పల్నాడు జిల్లాలో 50 వేల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వ నష్టాలను భర్తీ చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని, పల్నాడు అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story