ఆటోల్లో తిరుగుతూ గంజాయి విక్రయం.. 12 మంది గ్యాంగ్ అరెస్ట్

by Vemula.Srinu Prasad |

నార్త్ సబ్ డివిజన్ పరిధిలో డ్రగ్స్ విక్రయ, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న మంగళగిరి రూరల్ పోలీసులు మరో విక్రయ ముఠాను పట్టుకున్నారు. ...

ఆటోల్లో తిరుగుతూ గంజాయి విక్రయం.. 12 మంది గ్యాంగ్ అరెస్ట్
X

దిశ, మంగళగిరి: నార్త్ సబ్ డివిజన్ పరిధిలో డ్రగ్స్ విక్రయ, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న మంగళగిరి రూరల్ పోలీసులు మరో విక్రయ ముఠాను పట్టుకున్నారు. ఆటోలలో తిరుగుతూ గంజాయి సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను అత్యంత చాకచక్యంగా 12 మంది వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. మూడు కేజీల గంజాయి నిందితుల వద్ద నుంచి లభ్యమైంది. కీలక నిందితుడు విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ రావి మహేష్‌పై పిడి యాక్ట్ ఉంది. విజయవాడ, తాడేపల్లి మహానాడు, మంగళగిరి భార్గవ పేట రత్నాల చెరువు పరిసర ప్రాంతాలలో గంజాయి అమ్మడంతోపాటు వినియోగిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో బహిర్గతమైంది. నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో గంజాయి విక్రయం, రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story