చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

చిలకలూరుపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు...

చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట(Chilakaluripet)లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. కంటైనర్( Container)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తో్ంది. కారు ప్రయాణికులు గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నలుగురు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story