Breaking: మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నం.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నం చేశారు..

Breaking: మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నం.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం(Boyapalem)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి విడదల రజిని(Former Minister Vidudala Rajini)పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. తిరుమలలో లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తూ బోయపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో విడదల రజిని ప్రత్యేక పూజలు చేశారు. అయితే పూజలు జరుగుతుండగానే ఆలయం వద్దకు టీడీపీ నాయ‌కులు భారీగా తరలివచ్చారు. ఆలయం నుంచి బయటకు కారులో వెళ్తున్న ఆమెను అడ్డుకున్నారు.

జై పత్తిపాటి అంటూ..



జై పత్తిపాటి అంటూ కారుపై చేతులతో గుద్దుతూ దాడి చేసేందుకు యత్నించారు. కారును అడ్డుకుని, ముందుకు కదలనివ్వలేదు. దీంతో టీడీపీ నాయకులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విడుదల రజినీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళంలోనే విడుదల రజిని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు పరిస్థితిని సర్దుమనిగించారు.

Next Story