- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లను దేవుడు కరుణించినా.. మేం వదిలిపెట్టం: అంబటి రాంబాబు హెచ్చరిక
వాళ్లను దేవుడు కరుణించినా.. తాము వదిలిపెట్టమని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్: వాళ్లను దేవుడు కరుణించినా.. తాము వదిలిపెట్టమని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) హెచ్చరించారు. తిరుమల లడ్డూ నెయ్యి(Tirumala Laddu Ghee)లో జంతువుల కొవ్వు కలవలేదని కోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేవారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్‌కు భాగం లేదని చెప్పగలరా అని ప్రశ్నించారు. పవన్ వేషాలు సినిమాల్లో చూపించాలని, రాజకీయాల్లో కాదన్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా బుర్రవాడాలని అంబటి సూచించారు.తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ కుట్రకు తెరపడిందన్నారు. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ నివేదిక తేల్చిందని గుర్తు చేశారు. జగన్, వైవీ సుబ్బారెడ్డిపై బురదజల్లాలని చూశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.






