ఇద్దరు పిల్లల్ని చంపి.. తండ్రి ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

ఇద్దరు పిల్లల్ని చంపి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుంటూరు టౌన్ లో జరిగింది.

ఇద్దరు పిల్లల్ని చంపి.. తండ్రి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు పిల్లల్ని చంపి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుంటూరు టౌన్ లో జరిగింది. స్థానిక సాయిబాబా కాలనీలో షేక్ యూసఫ్ భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. ఇటీవల తన భార్యతో గొడవపడిన యూసుఫ్.. ఇద్దరు పిల్లల్నీ తీసుకుని సమీపంలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ పిల్లలు హుస్సేన్, ఆరిఫ్ లకు ఎలుకల మంది పెట్టి చంపాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యూసుఫ్ సోదరి ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యతో జరిగిన గొడవ గురించే యూసుఫ్ ఈ నిర్ణయం తీసుకున్నాడా ?లేక మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story