Ap News: ఇంటర్ అడ్మిషన్స్‌పై కీలక ఆదేశాలు

by Disha Web Desk 16 |
Ap News: ఇంటర్ అడ్మిషన్స్‌పై కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్మిషన్లు ఇవ్వొద్దని సూచించింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఏపీలో ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ప్రాక్టికల్ ఎజ్జామ్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరీక్షలు ముగియడంతో ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1న తిరిగి కాలేజీలు ప్రారంభంకానున్నాయి. అయితే వచ్చే ఏడాది ఇంటర్ ప్రవేశాలకు కాలేజీలు ఆడ్మిషన్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిసింది ఈ విషయం విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఇంటర్ ఆడ్మిషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

Next Story