సమాజానికి...దిశ... దశ: సినీ నటుడు అజయ్ ఘోష్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-12 12:49:40  IST  )

దిశ దినపత్రిక 2026 క్యాలెండర్‌ను ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ ఆవిష్కరించారు..

సమాజానికి...దిశ... దశ: సినీ నటుడు అజయ్ ఘోష్
X

దిశ ప్రతినిధి, బాపట్ల: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పత్రికా రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అగ్రగామిగా దూసుకు వెళ్తున్న దిశ తెలుగు దినపత్రిక పాఠకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం బాపట్ల జిల్లాలోని ఆయన స్వగ్రామం వేటపాలెంలో దిశ దినపత్రిక 2026 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.

దినదిన ప్రవర్దమానమై..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మీడియా రంగంలో అగ్రగామిగా దిశ పత్రిక దినదిన ప్రవర్దమానమై పాఠక లోకానికి మరింత చైతన్యవంతమైన వార్తా విశేషాలను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే దిశ పాఠకులందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయపరంగా దేశంలోని తాజా పరిణామాలను తెలుసుకోవడానికి దిశ దినపత్రిక ఎంతో దోహద పడుతుందన్నారు. ప్రజలను చైతన్య పరచడంలో దిశ ప్రముఖ పాత్ర పోషిస్తుందనీ ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆదరణతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఆ కోవలోనే దిశ పత్రిక

నిస్వార్ధంగా నిజాయితీగా సామాజిక దృక్పథంతో పని చేసే మీడియా సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయని, ఆ కోవలోనే దిశ పత్రిక పయనిస్తుందన్నారు. దేశానికి దిశ దశ చూపే విధంగా దిశ దినపత్రిక ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ బాపట్ల జిల్లా ప్రతినిధి ఎన్. నాగార్జున రెడ్డి, బాపట్ల ప్రతినిధి బడుగు విజయ భరత్, విద్యార్థులు రిషి, మాతృక, వర్షిత, సూర్యచంద్ర, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story